భారీ యాక్షన్, గ్రాండియర్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ‘PS – 2’ ట్రైలర్

Published on Mar 29, 2023 11:14 pm IST

మణిరత్నం దర్శకత్వంలో మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థల పై అత్యంత భారీ స్థాయి లో తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా మూవీ PS 2. గత ఏడాది పలు భాషల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న PS 1 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్. భారీ యక్షన్ తో పాటు గ్రాండియర్ విజువల్స్ తో ఆకట్టుకున్న ఈ ట్రైలర్ కి ప్రస్తుతం ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అరుణ్‌మొళి (జయం రవి) మరణించారనే వార్తతో చోళ రాజ్యంలో అధికారం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది. కానీ నిజం ఏమిటంటే వల్లవరైయన్ వంధియదేవన్ (కార్తీ) మరియు అరుణ్మోళి జీవించి ఉంటారు.

అరుణ్మోళి మరియు ఆదిత్య కరికాలన్ (విక్రమ్) సోదరి యువరాణి కుందవై (త్రిష), తన తండ్రి సుందర చోళన్ (ప్రకాష్ రాజ్)తో, అరుణ్మొళి శ్రీలంకలో నందిని (ఐశ్వర్యరాయ్)ని పోలిన స్త్రీని చూస్తుంది. మరొకవైపు, నందిని కరికాలన్ మరియు మొత్తం చోళ రాజవంశాన్ని అంతమొందించడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. వీటన్నింటిపై అధికారం కోసం రాజ్యంలో అనేక అంతర్గత కలహాలు ఏర్పడతాయి. అయితే ఆ తర్వాత ఏమి జరుగుతుంది, అధికారం ఎవరు దక్కించుకున్నారు, ఎవరు రాజు అయ్యారు అనే ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడవచ్చు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఏప్రిల్ 28 న గ్రాండ్ గా పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :