షూటింగ్ ముగించేసిన మణిరత్నం!

duet
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం తాజాగా చేస్తున్న చిత్రం ‘కాట్రు వెళియిదై’. హీరో కార్తీ, అదితి రావ్ హైదరి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్ననే మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ తేనండాళ్ ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘డ్యూయెట్’ పేరుతో రిలీజ్ చేయనున్నారు.

2017 మార్చిలో ఈ సినిమా విడుదలకానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కార్తీ, మణిరత్నంలు కలిసి మరొక సినిమా చేయాలని అనుకుంటున్నారని తమిళ సినీ వర్గాల సమాచారం.