“హీరామండి” షూటింగ్‌లో డిప్రెషన్‌తో పోరాడా – మనీషా కొయిరాలా!

“హీరామండి” షూటింగ్‌లో డిప్రెషన్‌తో పోరాడా – మనీషా కొయిరాలా!

Published on May 11, 2024 1:00 AM IST

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. హిస్టారికల్ డ్రామాలో అలనాటి నటి మనీషా కొయిరాలా వేశ్య పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. మనీషా కొయిరాలా మాట్లాడుతూ, హీరామండి షూటింగ్ సమయంలో డిప్రెషన్ మరియు మూడ్ స్వింగ్స్‌తో పోరాడా అని తెలిపింది.

క్యాన్సర్ బారిన పడిన వ్యక్తిగా, శరీరం మరియు మనస్సు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో నాకు తెలుసు. అవి ఒకదానికి ఒకటి ఆధారపడతాయి. ఇప్పుడు కూడా, నేను కొన్నిసార్లు డిప్రెషన్‌ను ఎదుర్కొంటాను. నిజాయితీగా చెప్పాలంటే, హీరామండిలో పని చేస్తున్నప్పుడు, డిప్రెషన్ నన్ను ఎంతగానో ఆక్రమించింది. నేను కేవలం వర్క్ పై దృష్టి పెట్టాను అని తెలిపింది.

ఈ సిరీస్‌లో తన పాత్ర గురించి మనీషా మాట్లాడుతూ, మల్లికాజాన్ గతంలో నేను పోషించిన ఇతర పాత్రలకు భిన్నంగా ఉంటుంది. సంజయ్ లీలా భన్సాలీ వంటి మేధావి నన్ను నడిపించడం వల్లనే ఇది సాధ్యమైంది. అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అని తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు