“గుడుంబా శంకర్” విషయంలో మణిశర్మ నిరాశ చెందిన వేళ.!

“గుడుంబా శంకర్” విషయంలో మణిశర్మ నిరాశ చెందిన వేళ.!

Published on Nov 30, 2022 7:07 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో చాలా మ్యూజికల్ హిట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే సంగీత దర్శకుడు మణిశర్మతో వచ్చిన ప్రతి సినిమా ఆల్బమ్ కూడా మంచి హిట్ అయ్యింది. అయితే వీరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు ఫలితం ఎలా ఉన్నా కూడా ఆడియో మాత్రం ఎక్కడా డిజప్పాయింట్ చెయ్యలేదు.

కానీ “గుడుంబా శంకర్” విషయంలో మాత్రం తాను బాగా డిజప్పాయింట్ అయ్యినట్టుగా మణిశర్మ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. తాను ఇచ్చిన ఎన్నో హిట్ చిత్రాల్లో ఈ సినిమా మరింత రీచ్ అయితే బాగుండు అని అనిపించిన సినిమాలు ఏవన్నా ఉన్నాయి అంటే అందులో గుడుంబా శంకర్ సినిమాని తాను చెప్పారు. ఈ సినిమాకి అనుకున్నంత రేంజ్ లో రాలేదని పాటలు అంతా బాగున్నాయి కానీ సినిమా ప్లాప్ కావడం కొంచెం డిజప్పాయింట్ గా అనిపించింది అని మణిశర్మ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు