“ఆచార్య” బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ఓపెన్ అయ్యిన మణిశర్మ.!

Published on Nov 29, 2022 4:21 pm IST

మ్యూజికల్ గా మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ కాంబినేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు సంగీత దర్శకుడు మణిశర్మ ల కాంబినేషన్ కూడా ఒకటి. ఒక్క పాటలు విషయం అనే కాకుండా వెరీ కాంబినేషన్ అంటే పవర్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లకి పెట్టింది పేరు. స్టాలిన్, ఇంద్ర, జై చిరంజీవ లాంటి సినిమాల్లో మణిశర్మ చిరు కి ఇచ్చిన స్కోర్ లు అయితే ఎవరూ మర్చిపోలేరు.

మరి ఇలాంటి ఓ సెన్సషనల్ కాంబినేషన్ స్టాలిన్ తర్వాత ఎన్నో ఏళ్ల అనంతరం అనౌన్స్ చేసిన సినిమానే “ఆచార్య”. గత కొన్నేళ్ల కితం అయితే కొరటాల శివ, మణిశర్మ తో అనౌన్స్ చేసిన ఈ చిత్రం మెగా ఫ్యాన్స్ లో విపరీతమైన హైప్ ని తెచ్చుకుంది. అయితే ఈ అంచనాలకి తగ్గట్టు పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. కానీ సినిమాలో మాత్రం ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ కాంబినేషన్ కి ఉన్న మార్క్ రేంజ్ లో లేదని మాత్రం అందరికీ క్లారిటీ వచ్చేసింది.

దీనితో ఈ మిస్టేక్ పై మణిశర్మ లేటెస్ట్ గా ఆలీ తో షోలో స్పందించారు. చిరంజీవి గారి సినిమాకి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందుకు తగ్గ వెర్షన్ ని కూడా సినిమాకి రెడీ చేసానని చెప్పారు. కానీ నెక్స్ట్ దర్శకుడు అలాంటివి ఏమీ వద్దు కొత్తగా కావాలని కోరగా మరొకటి ప్రిపేర్ చేసి ఇచ్చానని చెప్పారు. దీనితో ఈ క్లారిటీ ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :