మణిశర్మ తనయుడు ఈ సినిమాతో సత్తా చాటుతాడా ?

నాగ శౌర్య నటించిన ‘ఛలో’ సినిమా ద్వారా వెంకి దర్శకుడిగా పరిచయం కానున్నారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాడు వెంకి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా ఆంధ్ర , తమిళనాడు బాడర్లో జరిగే లవ్ స్టోరీగా చిత్రీకరించారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ‘జాదుగాడు, ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలకు సాగర్ సంగీతం అందించినా ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు చేసిన ‘ఛలో’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారాయన.

మరి ఈ చిత్రంతో అయినా ఆయన సత్తా చాటుతాడేమో చూద్దాం. హైదరాబాద్ అబ్బాయి, తమిళనాడు అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు వెంకి .ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో రస్మిక హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 2 న ఈ సినిమాను విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్.