ముంబై ఇండస్ట్రీ ను సింగిల్ హ్యాండ్ తో చేంజ్ చేశాడు ఆర్జీవీ – ప్రముఖ బాలీవుడ్ నటుడు!

ముంబై ఇండస్ట్రీ ను సింగిల్ హ్యాండ్ తో చేంజ్ చేశాడు ఆర్జీవీ – ప్రముఖ బాలీవుడ్ నటుడు!

Published on May 16, 2024 1:01 PM IST


తెలుగులో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రామ్ గోపాల్ వర్మ. కెరీర్ తొలి రోజుల్లో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమ కి అందించారు. అయితే టాలీవుడ్ ను వదిలి కొద్ది సంవత్సరాలు బాలీవుడ్ కి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ వర్మ బాలీవుడ్ తల రాతను మార్చే ఎన్నో కల్ట్ చిత్రాలను అందించారు. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఆర్జీవీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముంబై ఇండస్ట్రీ ను ఒక నార్త్ ఇండియన్ లేదా, లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు మార్చలేదు. హైదరాబాద్ నుండి వచ్చిన రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి బాలీవుడ్ ను సింగిల్ హ్యాండ్ తో చేంజ్ చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. అతను ఎవ్వరికీ భయపడడు, ఇప్పటికీ అని అన్నారు. మనోజ్ బాజ్ పాయ్ కి బీకు మాత్రే లాంటి ఎవర్ గ్రీన్ పాత్రను ఇచ్చింది ఆర్జీవీ నే. ఈ నటుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరొక పక్క ఎంతో ఫేమస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ తదుపరి సీజన్ లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు