ఆ వ్యక్తికి మంచు మనోజ్‌ వార్నింగ్

ఆ వ్యక్తికి మంచు మనోజ్‌ వార్నింగ్

Published on Jul 8, 2024 11:48 AM IST

మంచు మనోజ్‌ సామాజిక అంశాల పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదకరం అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ‘చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతో పాటు అసహ్యం కూడా వేస్తోంది. హాస్యం ముసుగులో సోషల్‌ మీడియాలో ఇలాంటి నీచమైన పనులు చేయడం బాధాకరమైన విషయం. ఇలాంటి ప్రవర్తన చాలా ప్రమాదకరమైంది. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం నేను ఏడాది క్రితం ఇన్‌స్టా ద్వారా ఒక వ్యక్తిని సంప్రదించాను.

కానీ, అతడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈరోజు అదే వ్యక్తి సోషల్‌ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్‌ చేస్తున్నాడు. పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలి. దయచేసి ఇలాంటి వారిని ఉపేక్షించవద్దు’ అంటూ తెలుగు రాష్ట్రాల పోలీసులకు మనోజ్ తన పోస్ట్ లో విజ్ఞప్తి చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ అధికారులను కోరారు. అలాగే ఆ వ్యక్తికి వార్నింగ్ ఇస్తూ ‘అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను’ అని మనోజ్ తన పోస్ట్ లో హెచ్చరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు