ఇంట్రెస్టింగ్ గా మంచు మనోజ్ ‘వాట్ ద ఫిష్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్

Published on May 20, 2023 10:01 pm IST

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా యువ దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ వాట్ ద ఫిష్. సిక్స్ సినిమాస్ అండ్ ఏ ఫిలిం బై వి సంస్థల పై భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ మూవీ నుండి నేడు మనోజ్ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని విడుదల చేసారు మేకర్స్. మనం మనం బరంపురం అనేది దీని ఉపశీర్షిక.

ఇక గ్లింప్స్ లో నేను చెడ్డ వాడిని, నేను నీ కోసం వస్తున్నాను, దాక్కోవడానికి చోటు వెతుక్కో, యుద్ధం మొదలైంది, పరుగెత్తడానికి చోటు వెతుక్కోండి అంటూ ఇంగ్లీష్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ వాయిస్, అటామిక్ క్రేజ్, రా, గ్రిట్ మరియు గన్స్ బ్లేజింగ్ అనే పదాలు సినిమా యొక్క కాన్సెప్ట్ ని మనకు వివరిస్తాయి. మొత్తంగా ఈ ఫస్ట్ గ్లింప్స్ అయితే అందరినీ డిఫరెంట్ గా ఆకట్టుకుంటోంది. నావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీకి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తుండగా దీనిని భారీగా తెరకెక్కించి ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చానేదుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా వాట్ ది ఫిష్ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం :