జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మనోజ్ !

Published on Sep 6, 2021 12:27 pm IST


హీరో మంచు మనోజ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. జగన్ తో దిగిన ఫోటోతో పాటు ఒక మెసేజ్ ను కూడా పోస్ట్ చేశారు.

‘ఎంతో దూరదృష్టి ఉన్న ఏపి ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్తు కోసం రానున్న సంవత్సరాల్లో ఆయన చేయబోతున్న పనుల గురించి ఆయన చేస్తున్న ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నాను. ఆయన ముందుచూపు నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకున్న దార్శనికతకు ముగ్దుడినయ్యాను. ‘సార్ మీరు అనుకున్న అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ మనోజ్ పోస్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం :