మంచు మనోజ్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది.

Manchu-Manoj
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు నట వారసుడు, ప్రముఖ యువహీరో మంచు మనోజ్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల (మార్చి) 4వ తేదీన ఉదయం 10.30 నిముషాలకు, శుభముహూర్తాన మనోజ్ మనోజ్ ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో హైదరాబాద్లో గల ఓ ప్రముఖ స్టార్ హోటల్లో జరుగుతుంది. హిందూ సంప్రదాయంలో ఈ వేడుక జరపాలని వధూవరుల కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు సమాచారం.

మంచు విష్ణు సతీమణి విరానికా క్లాస్‌మేట్ ప్రణతితో మనోజ్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్‌ లో సీపీఏ చేశారు. ప్రణతి తల్లిదండ్రులు, మోహన్ బాబు వీరి ప్రేమను అంగీకరించిన విషయం విదితమే. మార్చి 4న మొదట హీరో ఇంట పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత హోటల్లో రింగులు మార్చుకుంటారు.

మోహన్ బాబు కుటుంబ సభ్యులు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.

Exit mobile version