మంచు మనోజ్ సినిమా రిలీజ్ డేట్ !

7th, September 2017 - 11:01:53 AM


హీరో మంచు మనోజ్ ఎంతో ఇంటెన్సిటీతో చేసిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుందని, తన కెరీర్లో ఒక మైలురాయిలా మిగిలిపోతుందని మనోజ్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 8న విడుదలకావాలి. కానీ సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉండటం వలన వాయిదాపడింది.

దీంతో టీజర్, ట్రైలర్ చూసి సినిమాపై ఆసక్తి పెంచుకున్న ప్రేక్షకులు కాస్తంత నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకో నెలలో వర్క్ పూర్తవుతుందని, అక్టోబర్ 6న సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అజయ్ అండ్రూస్ నూతక్కి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు.