పక్కా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మంచు మనోజ్ సినిమా !

చివరగా’గుంటూరోడు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన మంచు మనోజ్ ప్రస్తుతం ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అజయ్ అండ్రూస్ నూతక్కి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీవీ చీఫ్ ప్రభాకరన్ పాత్రలోనూ, స్టూడెంట్ లీడర్ పాత్రలోను కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ కూడా విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.

కానీ సినిమా విడుదల మాత్రం సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉండటం వలన వాయిదాపడుతూ వస్తోంది. దీంతో టీమ్ పన్నుల్ని వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేసేసి విడుదల తేదీని పక్కా చేసింది. వచ్చే నెల నవంబర్ 10న సినిమా విడుదలకానుంది. ఈ విషయాన్ని దీపావళి సందర్బంగా మంచు మనోజ్ స్వయంగా ప్రకటించారు. ఎస్.ఎన్ రెడ్డి, లక్ష్మి కాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది.