నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న మనోజ్ సినిమా !


మంచు మనోజ్ నటించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ ట్రైలర్ తెలుగులో నిన్న విడుదలకాగా ఈరోజు తమిళంలో విడుదలైంది. తెలుగులో వచ్చినట్టే తమిళంలో కూడా ఈ ట్రైలర్ కు మంచి ప్రసంశలు దక్కుతున్నాయి. అజయ్ అండ్రూస్ నూతక్కి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎల్టీటీవీ చీఫ్ ప్రభాకరన్ జీవితం ఆధారంగా రూపొందడంతో సినిమాపై తమిళుల్లో మంచి ఆసక్తి ఉంది. అందుకే అక్కడ మంచి స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

అంతేగాక ప్రభాకరన్ ఇష్యూ దేశవ్యాప్తమైన అంశం కావడంతో తెలుగు, తమిళంతో పాటే హిందీ, కన్నడలలో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో మనోజ్ ప్రభాకరన్ గాను, మరియు ఒక శరణార్థి అయినా విద్యార్థి నాయకుడిగాను రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఎస్.ఎన్ రెడ్డి, లక్ష్మి కాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.