ఆసక్తి రేపుతున్న “మనుచరిత్ర” టీజర్..!

Published on Oct 8, 2021 12:58 am IST

శివ కందుకూరి హీరోగా కొత్త దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మనుచరిత్ర”. నార్ల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మేఘ ఆకాశ్ ప్రధాన కథానాయిక కాగా, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ కూడా కథానాయికలుగా కనిపించనున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. లవ్.. యాక్షన్.. ఎమోషన్ నేపథ్యంలో సాగిన ఈ టీజర్ సినిమాపై ఒకింత ఆసక్తిని రేకెత్తించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :