రిలీజ్‌కు సిద్ధమైన మళయాల సూపర్‌స్టార్ సినిమా!
Published on Nov 21, 2016 8:51 pm IST

manyam-puli
మళయాల సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్న మోహన్ లాల్, ఈమధ్యే ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ అన్న రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మళయాలంలో ఆయన హీరోగా నటించిన ‘పులిమురుగన్’ అనే సినిమాను తెలుగులో ‘మన్యం పులి’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు సెన్సార్‌కు వెళ్ళనుండగా, డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.

మళయాలంలో ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడి బాక్సాఫీస్ పరంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా చెప్పబడుతోంది. మళయాలంలో మాదిరే తెలుగులోనూ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని టీమ్ వ్యక్తం చేస్తోంది. వైశాక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించారు.

 
Like us on Facebook