రీసెంట్ గా మళయాళ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చి అదరగొట్టిన లేటెస్ట్ చిత్రాల్లో నటుడు ఉన్ని ముకుందన్ నటించిన భారీ వైలెంట్ చిత్రం “మార్కో” కూడా ఒకటి. దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు కూడా సాధించింది. ఇక తెలుగు సహా హిందీలో కూడా వచ్చిన ఈ సినిమా ఈ రెండు భాషల్లో కూడా మంచి వసూళ్లు అందుకోగా రీసెంట్ గానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది.
ఈ సినిమా ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న సోనీ లివ్ లో రీసెంట్ గానే పాన్ ఇండియా భాషల్లో వచ్చిన ఈ సినిమా ఇపుడు మరో స్ట్రీమింగ్ యాప్ ఆహా లో తెలుగులో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఆహా లో ఈ సినిమా ఈ ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులో రానున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇది ఇండియన్ వెర్షన్ లో కాగా ఓవర్సీస్ ఆడియెన్స్ కి ఈ ఫిబ్రవరి 18 నుంచి సినిమా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. సో మార్కో మరో ఓటిటిలో కూడా ఇపుడు సందడి చేయనుంది అని చెప్పాలి.
Get ready to experience the most violent and biggest film on Aha! #Marco storms in with action like never before. Streaming from Feb 21 only in Telugu, on Aha!
Overseas streaming from Feb 18 ! pic.twitter.com/uHFHr7zH6f
— ahavideoin (@ahavideoIN) February 16, 2025