మార్క్ ఆంటోనీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ!

Published on Sep 5, 2023 5:27 pm IST

విశాల్ మరియు ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో, అధిక్ రవి చంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మార్క్ ఆంటోనీ. రితూ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 15, 2023న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేయడం జరిగింది.

ఈ చిత్రంలో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సునీల్, సెల్వరాఘవన్ వంటి ప్రతిభావంతులైన నటులతో స్క్రీన్‌ను పంచుకుంటూ తండ్రి మరియు కొడుకుల పాత్రలను పోషిస్తున్నాడు విశాల్. మార్క్ ఆంటోనీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :