“మార్క్ ఆంటోనీ” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!

కోలీవుడ్ యాక్టర్ విశాల్ మరియు ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మార్క్ ఆంటోనీ. ఇందులో వీరిద్దరూ డ్యూయల్ రోల్ లో నటించారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

అందుకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. థియేటర్ల లో హిట్ గా నిలిచిన ఈ చిత్రం 1.28 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది చాలా తక్కువే అని చెప్పాలి. ఈ చిత్రంలో రీతూ వర్మ, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, రెడిన్ కింగ్స్లీ, వై.జి.మహేంద్రన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Exit mobile version