Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
మార్షల్ ప్రీ రిలీస్ ఈవెంట్
Published on Sep 11, 2019 6:00 am IST

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీస్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…అభయ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. తను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను. హీరోగానే కాకుండా ఈ సినిమాతో నిర్మతగా ఒక అడుగు ముందుకు వెయ్యడం సంతోషంగా ఉంది. నిన్న మార్షల్ సినిమా చూసాను, నేను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ అని చెప్పవచ్చు.

హీరో అభయ్ మాట్లాడుతూ…మా మార్షల్ సినిమా ప్రీ రేలీస్ ఈవెంట్ కు వచ్చిన ప్రతివక్కరికి థాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. అన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము ఈ సినిమా తీసాము. స్వామి గారు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా గ్రాండ్ గా వచ్చింది. నేను బాగా పెర్ఫామ్ చేయడానికి శ్రీకాంత్ గారు సపోర్ట్ చేశారు. సెట్ లో ఆయన అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్ ఇలా అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. శ్రీకాంత్ గారికి నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడు వచ్చినా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా అలాగే అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.

డైరెక్టర్ జయరాజ్ సింగ్ మాట్లాడుతూ..మా హీరో, నిర్మాత అభయ్ ఈ కథ నేను చెప్పినప్పుడు విన్న వెంటనే చెయ్యడానికి ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. సెప్టెంబర్ 13న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.


సంబంధిత సమాచారం :