డైరెక్టర్ మారుతీ షో రన్నర్ గా “3 రోజెస్” వెబ్ సిరీస్!

Published on Oct 1, 2021 7:30 pm IST

టాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఆహా వీడియో ఇప్పటికే పలు కొత్త చిత్రాలను మరియు వెబ్ సిరీస్ లను అందించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మరొకసారి సరికొత్త తెలుగు ఒరిజినల్ షో ను తీసుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. మాస్ ఎంటర్ టైన్మెంట్ మాస్టర్ డైరక్టర్ మారుతి మొట్ట మొదటి వెబ్ సిరీస్ 3 రోజెస్ కి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కి మాగ్గి దర్శకత్వం వహిస్తున్నారు. SKN ఈ వెబ్ సిరీస్ కి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి దీనికి కథ అందిస్తున్నారు. మొదటి సారి వెబ్ సిరీస్ ను చేస్తుండటం పట్ల నిర్మాత SKN సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ లో ఉన్న ఆ ముగ్గురు ఎవరు అంటూ సీరీస్ పై ఆసక్తి పెంచేశారు.

సంబంధిత సమాచారం :