రెండు సినిమాలకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్

maruthi
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో మారుతి కూడా ఒకరు. ‘ఈరోజుల్లో, బస్టాప్’ వంటి చిత్రాలతో ప్రస్తానం ప్రారంబించిన ఈయన ‘భలే భలే మాగాడివోయ్, బాబు బంగారం’ వరకూ పలు సూపర్ హిట్ సినిమాల్ని తెరకెక్కించారు. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడిగా కమర్షియల్ ఫార్ములాకు ఎంటర్టైన్మెంట్ ను జోడించి చెప్పడంలో ఆయన స్టైలే వేరు. తాజాగా ఈయన చేసిన ‘బాబు బంగారం’ ఒక రకంగా చెప్పాలంటే వెంకటేష్ కు మంచి కమ్ బ్యాక్ అనొచ్చు.

ప్రస్తుతం మారుతి తన తరువాతి సినిమాలకు స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలు కూడా ఆయన ఫార్ములాకు తగ్గట్టే కమర్షియల్ ఎంటర్టైనర్లుగా ఉండబోతున్నాయట. అలాగే ఈ రెండు సినిమాల్ని ప్రస్తుతం టాలీవుడ్ లో విజయవంతంగా సినిమాల్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ ఒకటి నిర్మిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ రెండు చిత్రాల్లో నటించబోయే హీరోహీరోయిన్లు, ఇతర ముఖ్య వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.