నిజంగానే ప్రభాస్‌ తో సినిమా చేస్తున్నాడా ?

Published on Jan 23, 2022 9:01 pm IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని రూమర్స్ వినిపించాయి. అయితే.. ఈ వార్తలపై డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. దయచేసి అప్పటి వరకూ వేచి ఉండండి. డైరెక్టర్‌ గా నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్’ అని మారుతి చెప్పుకొచ్చాడు.

మరి మారుతి మాటలను బట్టి.. నిజంగానే ప్రభాస్‌ తో సినిమా చేస్తున్నాడా ? చూడాలి. ఒకవేళ ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇస్తే.. మారుతి రేంజ్ మారిపోయినట్టే. ఇక ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా మారుతి నుంచి మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు, అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.

సంబంధిత సమాచారం :