బన్నీతో ఆ హాలీవుడ్ తరహా సినిమా అనుకుంటున్న మారుతీ.!

Published on Aug 1, 2021 6:04 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మొత్తం ఇండియన్ వైడ్ కూడా మంచి ఫేమ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే బన్నీ స్టైలింగ్ కానీ తన వర్క్ కానీ మంచి నేషనల్ లెవెల్లోనే అనిపిస్తాయి అందుకే ఇంకా ఎలాంటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చెయ్యకుండానే అన్ని వర్గాల్లో భాషల్లో కూడా బన్నీ కి మంచి ఫేమ్ వచ్చింది.

అయితే ఒకవేళ బన్నీ తో కనుక సినిమా చేస్తే మంచి హాలీవుడ్ లెవెల్ సినిమా చెయ్యాలని ఉందని దర్శకుడు మారుతీ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పడం ఆసక్తిగా మారింది. తాను కూడా తీస్తే నెక్స్ట్ లెవెల్ గ్రాఫికల్ సినిమా చేస్తానని మరి ఒకవేళ అలాంటి సినిమా చేస్తే ఎవరితో చెయ్యాలి అనుకుంటున్నారంటే బన్నీ పేరే చెప్పారు.

అలాగే బన్నీతో హాలీవుడ్ “అలాడిన్” తరహా సినిమా చేస్తానని మారుతి చెప్పారు. మరి ఈ కాంబోలో ఎప్పుడు అలాంటి సినిమా సెట్టవుతుందో చూడాలి. మరి ప్రస్తుతం బుంన్నీ బన్నీ తన పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” చేస్తుండగా మారుతీ చాలా త్వరగా ఫినిష్ చేసిన చిత్రం “మంచి రోజులొచ్చాయి” రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :