మెగస్టార్ కోసం మారుతి అలాంటి కథను రెడీ చేస్తున్నాడా?

Published on Sep 11, 2021 2:05 am IST


మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఇక ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా దర్శకత్వంలో చేస్తున్న లూసిఫ‌ర్ రీమేక్ షూటింగ్‌లో బిజీ అయ్యాడు. దీని తర్వాత చిరు తన తదుపరి చిత్రాలను దర్శకులు మెహ‌ర్ ర‌మేశ్, బాబీలతో చేయనున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి డైరెక్టర్ మారుతీతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని కొద్ది రోజుల నుంచి టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల చిరంజీవిని కలిసిన మారుతి ఒక లైన్ చెప్పాడని, మారుతి చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చడంతో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసి కలవాలని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో మారుతి బిజీ అయ్యాడని, యాక్షన్.. ఎమోషన్.. కామెడీ ఇలా అన్ని అంశాలను జోడించి ‘శంకర్ దాదా’ తరహాలో సాగే కథను మారుతి సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అయితే బయటకు రాలేదు.

సంబంధిత సమాచారం :