మార్వెల్ నయా బ్లాక్ బస్టర్ ‘షేంగ్ – ఛీ’ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్?

Published on Sep 23, 2021 8:00 am IST


ప్రపంచంలోనే అతిపెద్ద బాక్సాఫీస్ నెట్ కలిగిన సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మార్వెల్ కామిక్స్ దే అని చెప్పాలి. ఇప్పుడు తమ సినిమాల్లో నాలుగో ఫేజ్ లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ నుంచి ఈ ఏడాది విడుదలైన చిత్రం ‘షేంగ్ – ఛీ’. ఈ కరోనా ప్యాండమిక్ టైం లో రిలీజ్ అయినా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ హిట్ అయ్యింది.

అంతే కాకుండా మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా పలు సినిమాలకు ధీటుగా వసూళ్లు అందుకొని డీసెంట్ రన్ ని కనబరిచింది. అంతే కాకుండా హీరో సిము లియూ కి కూడా మంచి అప్లాజ్ దక్కింది. మరి ఇంత బ్లాక్ బస్టర్ అయ్యిన ఈ చిత్రం స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం వచ్చే నవంబర్ లో 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్నట్టు తెలుస్తుంది.

ఇదివరకే మార్వెల్ వారి కంటెంట్ తో డిస్నీ వారు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. పైగా ఈ ఫేజ్ నుంచే రీసెంట్ గా ‘బ్లాక్ విడో’ సినిమా నేరుగా ఓటిటి రిలీజ్ కాగా ఇప్పుడు మరో సినిమా “హాక్ ఐ” కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇవి కాకుండా కొన్ని చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కి వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :