సెకండ్ వీకెండ్ లో పుంజుకున్న ‘మసూద’ !

సెకండ్ వీకెండ్ లో పుంజుకున్న ‘మసూద’ !

Published on Nov 28, 2022 4:00 PM IST

సంగీత, తిరువీర్‌, కావ్య ప్రధాన పాత్రల్లో వచ్చిన వినూత్న చిత్రం ‘మసూద’. హారర్‌ డ్రామా కథతో దర్శకుడు సాయి కిరణ్‌ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తోంది. సాలిడ్ మౌత్ టాక్ తో ఈ సినిమాకి రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో ఈ చిత్రం విజయవంతమైన వెంచర్‌గా మారడానికి మౌత్ టాక్ బాగా సహాయపడింది. కలెక్షన్ల పరంగా చూసుకుంటే, ఈ చిత్రం మొదటి వారాంతంలో కంటే 2వ వారాంతంలో పెద్ద సంఖ్యలో వసూలు సాధించింది.

మొత్తానికి ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అలాగే శుభలేక సుధాకర్, అఖిలా రామ్ కూడా మసూద చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సాయి కిరణ్ దర్శకత్వ పనితనం కూడా ఆకట్టుకుంది. రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు