డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “మసూద”?

Published on Dec 8, 2022 8:10 pm IST


తాజా తెలుగు చిత్రం మసూద బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దర్శకుడు సాయికిరణ్‌ థ్రిల్లర్‌ని గ్రిప్పింగ్‌గా వివరించిన విధానం ప్రేక్షకులను థ్రిల్‌గా ఆస్వాదించేలా చేసింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. ఆహా మేకర్స్‌కి పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓటిటి ప్లాట్‌ఫారమ్ ఈ నెల 16 లేదా 23న సినిమాను ప్రీమియర్‌గా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. స్వధర్మ్ ఎంటర్టైన్‌మెంట్ నిర్మించిన ఈ హర్రర్ చిత్రంలో తిరువీర్, కావ్య కళ్యాణ్, సంగీత, సుబలేఖ సుధాకర్, అఖిల రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :