స్ట్రాంగ్ బజ్..ఈ డేట్ కే “భీమ్లా నాయక్” టీజర్.!

Published on Nov 28, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇపుడు శరవేగంగా తెరకెక్కుతుంది.

అలాగే మరోపక్క ఓ ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో భీమ్లా నాయక్ గా పవన్, డానియల్ శేఖర్ గా రానాల పై డిజైన్ చేసిన పవర్ ఫుల్ టీజర్ కట్ రిలీజ్ డేట్ పైనే ఆసక్తి నెలకొంది. మరి దీని ప్రకారం వచ్చే డిసెంబర్ 14నే ఈ మాస్ టీజర్ ఫిక్స్ అయ్యిందట.

రానా దగ్గుబాటి బర్త్ డే స్పెషల్ గా ఈ సాలిడ్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారట. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

సంబంధిత సమాచారం :