యూఎస్ లో మాస్ బుకింగ్స్ సెట్ చేస్తున్న “భీమ్లా నాయక్”.!

Published on Feb 20, 2022 10:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మళ్ళీ భారీ హైప్ తో వస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు “భీమ్లా నాయక్” అనే చెప్పాలి. తన రీఎంట్రీ సినిమా “వకీల్ సాబ్” కి పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల దాని హైప్ తక్కువగా అనిపించింది కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ హైప్ దగ్గర అయితే పవన్ కం బ్యాక్ కూడా దిగదుడుపే అనిపిస్తుంది. ఆ రేంజ్ లో “భీమ్లా నాయక్” కోసం టాలీవుడ్ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భీమ్లా నాయక్ సెన్సేషన్ గట్టిగానే ఉంది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఊహించని లెవెల్లో బుకింగ్స్ జరుగుతున్నాయి. మరి లేటెస్ట్ గా అయితే యూఎస్ లో ప్రీమియర్స్ తోనే ఏకంగా 2 లక్షల డాలర్లు ఈ చిత్రం క్రాస్ చేసేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం పై ఎలాంటి హైప్ నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ట్రైలర్ వచ్చాక ఆ హైప్ ఇంకెంత ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :