ఇంట్రెస్టింగ్..’భీమ్లా’ నుంచి మాస్ గా రాబోతున్న డానియల్.?

Published on Sep 20, 2021 8:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిలు హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు భీమ్లా యుఫోరియా ని మనం విట్నెస్ చేసాము. ఇక భీమ్లా కి శత్రువు డానియల్ శేఖర్ ఎలా ఉంటాడో ఈరోజు చూపిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మరి దీనిపైనే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ రానా పై డిజైన్ చేసిన వీడియోలో అప్పుడు పవన్ వీడియోకి ఏదైతే మాస్ ని చూపించారో డానియల్ నుంచి కూడా అంతే సాలిడ్ మాస్ ని చూపించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు రానాపై ఎలాంటి గ్లింప్స్ తరహా వీడియో రిలీజ్ చేస్తామని మేకర్స్ కన్ఫర్మ్ చెయ్యలేదు మరి వచ్చేది పోస్టర్ నా లేక మాస్ వీడియోనా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :