ఎన్టీఆర్ బర్త్ డే కి మాస్ జాతరే.!?

Published on May 2, 2023 3:05 pm IST

మన టాలీవుడ్ స్టార్ హీరోల బర్త్ డే లు వస్తున్నట్టు అయితే ఇక ఆ నెల స్టార్ట్ అయితే అభిమానులకి భారీ జాతర మొదలు అయ్యినట్టే అని చెప్పాలి. ఇక గత మార్చ్ లో అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ నెలలో సాలిడ్ అప్డేట్స్ తో ఎంజాయ్ చేశారు. ఇక మరో బిగ్గెస్ట్ మాస్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ బర్త్ డే మంత్ మే నెల వచ్చేసింది. మరి ఈ నెలలో అయితే తారక్ బర్త్ డే కి వచ్చే అప్డేట్స్ ఏంటో క్రేజీ బజ్ ఇప్పుడు నెలకొంది.

మొదటగా అయ్యితే కొరటాల తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఎన్టీఆర్ 30 తాలుకా టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్ 31 కి సంబంధించి కూడా అప్డేట్ రానుండగా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అయినటువంటి “వార్ 2” నుంచి కూడా ఓ అధికారిక అప్డేట్ రావచ్చని తెలుస్తుంది. ఇక ఫైనల్ గా అయితే తారక్ బర్త్ డే సందర్భంగా ప్లాన్ చేస్తున్న “సింహాద్రి” రీ రిలీజ్ తో అయితే నెక్స్ట్ లెవెల్లో తారక్ బర్త్ కి మాస్ జాతరే జరగనుంది అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :