“భీమ్లా” అసలు మాస్ జాతరకి రంగం సిద్ధం అవుతుందా?

Published on Nov 16, 2021 8:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ హీరో రానా దగ్గుబాటిలు నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. రీమేక్ సినిమా అని మొదట్లో పెద్దగా హైప్ లేకపోయినా తర్వాత తర్వాత మాత్రం మాస్ ఆడియెన్స్ అటెన్షన్ బాగా అందుకుంది ఈ చిత్రం.

ఇప్పుడు భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం చాలా మందే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై క్రేజీ బజ్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు భీమ్లా నాయక్ మరియు డానియల్ శేఖర్ ల గ్లింప్స్ లను వేరే వేరేగా చూసాము.

కానీ ఇప్పుడు మాస్ జాతరకు రెడీ చేస్తున్నారట. ఇద్దరి మీద అదిరే టీజర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఇప్పుడు టాక్. అలాగే వచ్చే ఈ నవంబర్ చిరవరలోనే ఇది ఉండొచ్చని కూడా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం కానుందో వేచి చూడాలి. అలాగే దీనితో సినిమాపై ఇతర అంశాల పై కూడా కాస్త క్లారిటీ వస్తుంది.

సంబంధిత సమాచారం :

More