‘సింహాద్రి’ రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా మాస్ కా దాస్ ?

Published on May 15, 2023 11:30 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో కెరీర్ పరంగా బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకుని మరింత క్రేజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా కొరటాల శివతో ఆయన చేస్తున్న NTR 30 మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కి జోడీగా జాన్వికపూర్ నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విషయం ఏమిటంటే, ఇటీవల కొన్నాళ్లుగా టాలీవుడ్ లో పలు పాత సక్సెస్ఫుల్ సినిమాలని రీ రిలీజ్ చేయడం చూస్తున్నాం.

తాజాగా ఎన్టీఆర్ ఒకప్పటి అతి పెద్ద సక్సెస్ఫుల్ మూవీ సింహాద్రిని ఆయన పుట్టినరోజైన మే 20న గ్రాండ్ గా పలు థియేటర్స్ లో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ మూవీ యొక్క రీ రీలీజ్ ఈవెంట్ ని మే 17న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరుపనుండగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా యువ నటుడు మాస్ కా దాస్ విశ్వక్సేన్ రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపేందుకు ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. అయితే దీని పై అధికారికంగా న్యూస్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :