తన డ్రీం కారును ఎట్టకేలకు కొనుకున్న మాస్ కా దాస్.!

Published on May 18, 2022 10:21 pm IST


ప్రస్తుత జెనరేషన్ టాలీవుడ్ హీరోల్లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకున్న వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. అయితే తన ప్రతి సినిమాకి కూడా ఏదొక వైవిధ్యతను కనబరుస్తూ వస్తున్న విశ్వక్ రీసెంట్ గా అయితే “అశోక వనంలో అర్జున కళ్యాణం” అనే సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు.

అయితే ఈ సినిమా సక్సెస్ తర్వాత తాను ఫైనల్ గా తన డ్రీం కార్ అయినటువంటి మెర్సిడిస్ గ్వాగన్ ని కొనుగోలు చేసినట్టుగా దానితో దిగిన ఫోటోలు కొన్ని షేర్ చేసి పంచుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ తో పాటుగా ఆ కారును కొనుగోలు చెయ్యడానికి వెళ్లినట్టుగా షేర్ చేసుకున్నాడు. ఎట్టకేలకు అయితే తన డ్రీమ్ కారును కొనుగోలు చెయ్యడంతో ఆనందం వ్యక్తం చేస్తూ తాను ఇక్కడ వరకు రావడానికి ఎంతో సపోర్ట్ ఇచ్చిన తన అభిమానులు థాంక్స్ చెబుతున్నానని విశ్వక్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :