“మెరిసే మెరిసే” ట్రైలర్ లాంచ్ చేసిన ‘మాస్ కా దాస్’.!

Published on Jul 29, 2021 3:46 pm IST


యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

మరి ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ లాంచ్ చెయ్యడం జరిగింది. మరి అది చూసాక ట్రైలర్ చాలా బాగుందన్న విశ్వక్ సేన్…’మెరిసే మెరిసే’ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

ఇక ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…”దినేష్ తేజ్ నేనూ ‘హుషారు’ సినిమా టైమ్ నుంచి ఫ్రెండ్స్. కలిసి క్రికెట్ బాగా ఆడేవాళ్లం. తను మంచి పర్మార్మర్. టాలెటెండ్ ఆర్టిస్ట్. ‘మెరిసే మెరిసే’ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చివరలో దినేష్ చెప్పిన డైలాగ్ సూపర్. థియేటర్లు ఓపెన్ అవడం సంతోషకరం. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్ లో సినిమా చూసిన అనుభూతి వేరు. ఆగస్టు 6న ‘మెరిసే మెరిసే’ థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. తప్పక చూడండి. అని తెలిపాడు.

అలాగే దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ*…మా సినిమా ట్రైలర్ ను విశ్వక్ సేన్ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆయనది సక్సెస్ ఫుల్ హ్యాండ్. ఆ లక్ మా సినిమాకూ కలిసొస్తుందని ఆశిస్తున్నాం. ఆగస్టు 6 మా సినిమాను పీవీఆర్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా మీ ముందుకొస్తున్న ‘మెరిసే మెరిసే’ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

యంగ్ హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ..మా సినిమా ‘మెరిసే మెరిసే’ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు నా ఫ్రెండ్ విశ్వక్ సేన్ కు థాంక్స్. ఆగస్టు 6న థియేటర్ లలో కలుసుకుందాం అని తెలిపాడు.

సంబంధిత సమాచారం :