మాస్ “ఖిలాడి” డబుల్ ట్రీట్ టోటల్ రన్ టైం వచ్చేసింది.!

Published on Feb 9, 2022 3:39 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్లు గా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి”. రవితేజ కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో మరియు యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఇప్పుడు రానున్న ఫిబ్రవరి 11న రిలీజ్ కి రెడీగా ఉంది. మరి తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి తెలుగు సెన్సార్ ఇప్పుడు కంప్లీట్ అయ్యింది.

మరి దీనికి గాను యూ/ఏ సర్టిఫికెట్ రాగా టోటల్ గా ఈ చిత్రం మొత్తం 154 నిమిషాల నిడివి గా వచ్చిందట. అంటే రెండు గంటల 34 నిమిషాలు మాస్ ఖిలాడి డబుల్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందేగా.. అలా ఇద్దరితో రెండున్నర గంటలు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రెడీ అయ్యిపోయింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా ఏ స్టూడియోస్ మరియు పెన్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :