మాస్ మహారాజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ షురూ.!

Published on Oct 2, 2021 11:35 am IST


ఈ ఏడాది తన సినిమా “క్రాక్” తో టాలీవుడ్ కి శుభారంభాన్ని ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ దాని తర్వాత తన మార్క్ స్పీడ్ తో మరిన్ని సాలిడ్ చిత్రాలు లైన్ లో పెట్టేసాడు. మరి వాటిలో ఆల్రెడీ “ఖిలాడి”, “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాలు కంప్లీట్ అవుతుండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ పై కూడా బజ్ ఎపుడు నుంచో ఉంది. అదే హిట్ సినిమాల దర్శకుడు త్రినాధరావు నక్కినతో..

ఈ సినిమాపై ఎప్పుడు నుంచో టాక్ ఉండగా ఇప్పుడు దీనిపై అధికారిక క్లారిటీ వచ్చేసింది. రవితేజ కెరీర్ లో 69వ సినిమాగా ఇప్పుడు దాన్ని అనౌన్స్ చేసేసారు. అంతే కాకుండా ఈ చిత్రం రెగ్యులర్ షూట్ వచ్చే అక్టోబర్ 4 నుంచి స్టార్ట్ అవ్వనున్నట్టు మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :