టాక్..మెగాస్టార్ పక్కా మాస్ సినిమాలో మాస్ మహారాజ్..?

Published on Nov 11, 2021 7:10 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం మలయాళ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఇక దీని తర్వాత భోళా శంకర్ అనే మరో రీమేక్ ని కూడా చిరు స్టార్ట్ చేయనుండగా వీటిని హైప్ ని ఇస్తుంది మాత్రం దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) తో చేస్తున్న సినిమా అని చెప్పాలి.

మెగాస్టార్ 154వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా వస్తుంది. మరి ఈ సినిమాలోనే మాస్ మహారాజా రవితేజ ఓ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ రవితేజ మెగాస్టార్ తోని బాబీ తోని సినిమా చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో తాను ఒక క్యామియో రోల్ లో కనిపించనున్నారట. మరి ఇందులో ఎంతమేర నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More