ఊహించని అవతార్ లో “టైగర్ నాగేశ్వరరావు” గా మాస్ మహారాజ్.!

Published on Apr 2, 2022 2:00 pm IST

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోస్ లో ఒకరైన మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు తన కెరీర్ లో మరోసారి జెట్ స్పీడ్ లో ఒకదాన్ని టేకప్ చేస్తూ ఫినిష్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఈ చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా దర్శకుడు వంశీ తో చేస్తున్న సాలిడ్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి.

మరి ఈ సినిమాని ఈరోజు ఉగాది సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చెయ్యడమే కాకుండా మోస్ట్ అవైటెడ్ ప్రీ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో రవితేజ లుక్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాలి. కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ లో మాంచి దిట్టమైన పర్సనాలిటీ తో చేతిలో తాడు బ్యాక్గ్రౌండ్ ట్రైన్ విజువల్స్ తో మంచి ఆసక్తిగా ఈ పోస్టర్ కనిపిస్తుంది. అలాగే ఇదే సినిమాలో రవితేజ తన సిక్స్ ప్యాక్ అవతార్ ని కూడా చూపించబోతున్నట్టు అర్ధం అవుతుంది. మరి ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :