టాక్..ఈ యువ దర్శకునికి మాస్ మహరాజ్ అవకాశం..?

Published on Jun 16, 2022 7:02 am IST


కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో మన టాలీవుడ్ స్టార్స్ ముందే ఉంటారు. అలాంటి వారిలో మన మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. అయితే రవితేజ ఆల్రెడీ పలువురుకి దర్శకునిగా తన సినిమాతోనే పరిచయం చేయగా దర్శకునిగా ఎంటర్ అయ్యి ఒకటి రెండు సినిమాలు అనుభవం ఉన్న వారితో కూడా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

మరి ఇప్పుడు లేటెస్ట్ గా కూడా అలాంటి ఒక దర్శకునితో వర్క్ చేయడానికి ఓకే చెప్పినట్టుగా టాక్. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రముఖ యాంకర్ ప్రదీప్ ని హీరోగా పరిచయం చేస్తూ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అని సినిమా తీసి హిట్ అందుకున్న దర్శకుడు మున్నా అట. ఇప్పుడు ఈ యంగ్ దర్శకుడుకే మాస్ మహరాజ్ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :