యాక్షన్ సీక్వెన్స్ లో ‘రామారావు’ ఆన్ డ్యూటీ !

యాక్షన్ సీక్వెన్స్ లో ‘రామారావు’ ఆన్ డ్యూటీ !

Published on Oct 25, 2021 1:00 PM IST

మాస్ మహారాజ రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా రాబోతుంది. అయితే, తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను శరవేగంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ఈ ఫైట్ సీన్స్ వెరీ వైల్డ్ గా ఉంటాయట. సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్ గా ఈ సీన్స్ ఉండబోతున్నాయి అని తెలుస్తోంది.

శరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇక ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తోన్న ఆసక్తికర హింట్స్, అండ్ అప్డేట్స్ పట్ల రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అన్నట్టు ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ రవితేజకి జంటగా నటించబోతోంది. ఆమె క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు