‘గట్టా కుస్తీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసిన మాస్ మహారాజా

‘గట్టా కుస్తీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసిన మాస్ మహారాజా

Published on Nov 20, 2022 12:08 AM IST


విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా రవితేజ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలపై తెరకెక్కిన లేటెస్ట్ స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ డ్రామా తమిళ మూవీ గట్టా కుస్తీ. తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రిలీజ్ కానున్న ఈ మూవీ పై తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ యొక్క తమిళ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నేడు చెన్నై లో ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ మహారాజ రవితేజ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా తెలుగు వర్షన్ అయిన మట్టి కుస్తీ ట్రైలర్ ని రేపు రాత్రి 8 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు చెల్లా అయ్యవు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, అలానే డిసెంబర్ 2 న విడుదల కానున్న ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ మెప్పు అందుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు