ఢీ 14 : మాస్ మహారాజ్ పవర్ఫుల్ ప్రెజెన్స్ తో గ్రాండ్ ఫినాలే..!

Published on Nov 26, 2022 3:00 pm IST

మన తెలుగు బుల్లితెర దగ్గర మాత్రమే కాకుండా మన సౌత్ ఇండియా టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే గ్రాండ్ డాన్స్ షో “ఢీ” కూడా ఒకటి. మరి ఇప్పుడు 14వ సీజన్ కి విజయవంతంగా చేరుకొని సాలిడ్ టీఆర్పీ తో దూసుకెళ్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సీజన్ కూడా అంతిమ దశకి చేరుకుంటుండడంతో ఈ గ్రాండ్ ఫినాలే కి సాలిడ్ పర్శనాలిటీ తప్పకుండా కనపడతారు. మరి అలా ఈసారి అయితే మాస్ మహారాజ రవితేజ ఈ గ్రాండ్ ఫినాలే లో గెస్ట్ గా హాజరయ్యి తన పవర్ ఫుల్ ప్రెజెన్స్ తో అదరగొట్టినట్టుగా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేయడంతో కన్ఫర్మ్ అయ్యిపోయింది.

మరి ఈ ప్రోమోలో ప్రదీప్ రవితేజ ని ఎలివేట్ చేస్తూ సాగగా ఇందులో కూడా రవితేజ తన మార్క్ టైమింగ్ తో చిన్న బిట్ తో అదరగొట్టారు. మరి ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డేట్ అయితే అతి త్వరలోనే అనౌన్స్ ఈటీవీలో ప్రసారం కానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :