‘ధమాకా’ నుండి ‘మాస్ రాజా’ సాంగ్ రిలీజ్

Published on Sep 23, 2022 7:02 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రొమాంటిక్ గ్లింప్స్, జింతాక్ సాంగ్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇక నేడు ఈ మూవీ నుండి మాస్ బీట్ తో సాగే మాస్ రాజా అనే పల్లవితో సాగె లిరికల్ సాంగ్ ని యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ ని నకాష్ అజీజ్ అద్భుతంగా ఆలపించగా ఈ సాంగ్ కి సూపర్ మాస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ . ప్రస్తుతం ఈ సాంగ్ మాస్ తో పాటు యువతని కూడా ఎంతో ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీని దీపావళి కానుకగా మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :