రామ్ పోతినేని “విజిల్” సాంగ్ కి అద్దిరిపోయే రెస్పాన్స్!

రామ్ పోతినేని “విజిల్” సాంగ్ కి అద్దిరిపోయే రెస్పాన్స్!

Published on Jun 28, 2022 11:00 AM IST


రామ్ పోతినేని హీరోగా, డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈ చిత్రం లో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన మరో మాస్ సాంగ్ విజిల్ కి సూపర్ మాస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు తెలుగు మరియు తమిళ భాషల్లో కలిపి 12 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. సోషల్ మీడియాలో ది వారియర్ చిత్రం సాంగ్స్ ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను జూలై 14, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు