వైరల్ : మొత్తానికి బాలయ్య నుంచి ఓ మాస్ సెల్ఫీ.!

Published on Mar 9, 2023 9:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి తో అయితే తన కెరీర్ లో 108వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీనికి ముందు అయితే బాలయ్య నటించిన మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి” భారీ హిట్ కావడంతో ఇక తన 108 తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. మరి లేటెస్ట్ గా మళ్ళీ షూట్ కోసం సిద్ధం అవుతున్న బాలయ్య నుంచి ఓ అదిరే సెల్ఫీ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఏపీ లోని ఓ జ్వెలరి స్టోర్ ఓపెనింగ్ కి వచ్చిన బాలయ్య అయితే వచ్చిన అభిమానులతో ఎంతో ఆహ్లాదంగా తీసుకున్న సెల్ఫీ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మామూలుగా బాలయ్య తో సెల్ఫీ అంటే అది ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో తన నుంచి మొత్తానికి ఓ మాస్ సెల్ఫీ లాంటిది వస్తే అది స్పెషల్ అనే చెప్పాలి మరి. దీనితో మిగతా బాలయ్య, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :