సీటిమార్ నుండి మాస్ సాంగ్ “జ్వాలా రెడ్డి” వీడియో గ్లింప్స్ నేడే విడుదల!

Published on Sep 8, 2021 12:40 pm IST


దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సీటిమార్. ఈ చిత్రం విడుదల కి సిద్ధం అయ్యింది. ఈ నెల 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్ల లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి.

అయితే ఈ చిత్రం నుండి జ్వాలా రెడ్డి అంటూ ఒక పాట ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ సాంగ్ ప్రోమో విడుదల కానుంది. ఈ చిత్రం లో భూమిక చావ్లా, దిగంగణ సూర్య వంశీ, రేహమాన్, అప్సర రాణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :