రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్

Published on Jun 30, 2022 4:45 pm IST

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో రవితేజ ఒక పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ఆయనకి జోడీగా రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సామ్ సి ఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు రెండు సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుండి శ్రేయ ఘోషల్ ఆలపించిన ‘నా పేరు సీసా’ అనే మాస్ సాంగ్ ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది యూనిట్. నటి అన్వేషి జైన్ తన మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం మంచి వ్యూస్ అందుకుంటోంది. చంద్రబోస్ రాసిన ఈ మాస్ సాంగ్ ని శ్రేయ ఘోషల్ అద్భుతంగా ఆలపించినట్లు ప్రోమోని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ పూర్తి సాంగ్ ని జులై 2న రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ మూవీ జులై 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :