మరి మహేష్ సినిమా నుంచి మాస్ ట్రీట్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Feb 22, 2022 9:00 am IST


ప్రస్తుతం మన స్టార్ హీరోల అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఓ పక్క కొత్త సినిమాలు రిలీజ్ లు ఇంకో పక్క వాటి తాలుకా అప్డేట్స్ తో అదరగొడుతున్నారు. మరి ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా లేటెస్ట్ ‘కళావతి’ తో సూపర్ కిక్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా “సర్కారు వారి పాట” నుంచి ఇంకా ముందు అసలు ట్రీట్స్ బాకీ ఉన్నాయి.

వాటిలో ఈ సినిమా టైటిల్ ట్రాక్ అయినటువంటి మాస్ సాంగ్ కూడా ఒకటి. థమన్ ఇచ్చిన ఈ క్రేజీ ట్రాక్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ మాస్ సాంగ్ ట్రీట్ కి గాను డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి దీని ప్రకారం అయితే ఈ రానున్న మార్చ్ 18న విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. అయ్యితే మార్చ్ లోనే ఈ సాంగ్ రిలీజ్ ఉంటుందని టాక్ ఉంది కానీ దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :